రూ. 1 లక్ష కోట్ల బాండ్ల విక్రయానికి ఆర్బిఐ నిర్ణయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్యతను అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నెలలో మూడు విడతలుగా ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం వల్ల రుణగ్రహీతలపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉండగా, ఫిక్స్డ్ డిపాజిట్దారులకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.