భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్న రాజుల కండ్రిగ వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఆరవ రోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. లడ్డు వేలం పాటలో కడివెల్ల రవిరాజు డెబ్బై మూడు వేలకు దక్కించుకోగా, రూపాయి బిళ్ళను పర్వతాల దిలీప్ కుమార్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.