ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం: పైలట్ సహా ఆరుగురు మృతి

రిపోర్టర్: సతీష్ స్థలం: చమోలీ

రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషీమఠ్ సమీపంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఎస్పీ వెల్లడించారు. బద్రీనాథ్ ఆలయ దర్శనం ముగించుకుని డెహ్రాడూన్కు బయలుదేరిన హెలికాప్టర్ మార్గమధ్యంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఢిల్లీకి చెందిన పైలట్తో పాటు కర్ణాటకకు చెందిన ఐదుగురు ప్రయాణికులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.