బ్రిటన్‌లో భారీగా విమానాల రద్దు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: సతీష్ స్థలం: World

బ్రిటన్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. వందలాది విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ సాంకేతిక సమస్యను పరిష్కరించినప్పటికీ, సేవలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.