పాపమ్మ గుడి నిర్మాణానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయం అందించిన రాజగోపాల్రెడ్డి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామంలోని పాపమ్మ గుడి నిర్మాణానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.రెండు లక్షల ఆర్థిక సహాయం అందించారు. గురువారం స్థానిక నేతల ద్వారా ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోసనం రాకేష్రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ సుర్వి నరసింహగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.