సూర్యాపేటలో నాసిరకం పదార్థాల విక్రయం: నిబంధనలు ఉల్లంఘించిన బేకరీ సీజ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేటలో నాసిరకం పదార్థాల విక్రయంపై ఆహార తనిఖీ విభాగం అధికారి ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పట్టణంలోని ఓ బేకరీలో గడువు తేదీలు లేని సరకులను గుర్తించి పుర, పోలీసు అధికారుల సాయంతో ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలపై నిరంతరం తనిఖీలు ముమ్మరం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.