విద్యార్థులకు అలర్ట్: త్వరలో విడుదల కానున్న స్పెషల్ టెట్ హాల్ టికెట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్ స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 అడ్మిట్ కార్డులను అక్టోబర్ 31వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ విద్యా సేవా నియామక కమిషన్ అధికారులు వెల్లడించారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు షిఫ్ట్ లలో ఈ రాత పరీక్ష జరగనుందని, అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.