అధికారుల రాతిగుండెల నడుమ నిలిచిపోయిన పసికందు ఊపిరి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిత్తూరు
చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మూడవ త్రైమాసిక జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, పరిష్కరించాలని ఎంపీ హెచ్చరించారు. అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు.