అమెరికాలో ఘనంగా తానా 5కే వాక్: ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ప్రజలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సెయింట్ లూయిస్

అమెరికాలోని సెయింట్ లూయిస్లో తానా టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే వాక్ రన్ కార్యక్రమం ఘనవిజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. సామాజిక సేవే లక్ష్యంగా, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ రాజా సూరపనేని, ప్రాంతీయ కోఆర్డినేటర్ రవి పొట్ల తదితర ప్రముఖులు హాజరై ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించారు.