ఆమనగల్లులో దేవాలయాల తాళాలు పగులగొట్టి చోరీ: నిందితుడి అరెస్ట్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి వస్తువులను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి లక్షా అరవై ఐదు వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పలు గ్రామాల్లోనూ చోరీలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడిని రిమాండ్కు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.