పచ్చదనం పరిఢవిల్లేలా కదంతొక్కిన హుస్నాబాద్ పురప్రజల సంకల్పం

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఘనంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 20వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గోపగొని శోభన్, మున్సిపల్ సిబ్బందితో పాటు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.