నెట్ఫ్లిక్స్లో విజయ్ దేవరకొండ రణబాలి ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని మేకర్స్ తెలిపారు. సినిమా విడుదలకు ముందే చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ నెట్ఫ్లిక్స్ వేదికగా నాలుగు ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వారు వెల్లడించారు. సెప్టెంబర్ 28 నుంచి మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని, ఈ సిరీస్ ద్వారా సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి.