పోలవరం యాంటీ మలేరియా మాత్రల ఘటన: సుమోటోగా విచారించిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: మహేష్
స్థలం: Eluru
పోలవరం ఏజెన్సీలో యాంటీ మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి చెందిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఘటన వివరాలు, తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన బాధితులంతా క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు ప్రక్రియను ఏపీ హైకోర్టు నిశితంగా పర్యవేక్షించాలని ధర్మాసనం ఆదేశించింది.