జీవీఎంసీ ఎన్నికల్ లో పొరపాటు: మరో వార్డులో ఓటు వేసిన ఎమ్మెల్యే పంచకర్ల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు తన ఓటు హక్కును వేరే వార్డులో వినియోగించుకున్నట్లు సమాచారం వెలువడిందని అధికారులు తెలిపారు. జీవీఎంసీ 117వ వార్డుకు చెందిన ఆయన, పొరపాటున 115వ వార్డు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.