తీరం దాటనున్న తీవ్ర తుపానుతో కోస్తాంధ్రకు భారీ ముప్పు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నవంబర్ రెండు లేదా మూడవ తేదీల్లో మచిలీపట్నం బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.