మురసు తుఫాన్ ముప్పు: ఐదు జిల్లాల్ లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

మురసు తుఫాన్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాల్ లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గుంటూరు, కృష్ణా, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్ లో విద్యాసంస్థలకు సెలవులు అమల్ లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.