జీవీఎంసీ పోలింగ్ శాతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీవ్ర నిరసన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ శాతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. ఓటింగ్ తీరు, అధికారులు విడుదల చేసిన గణాంకాలపై వారు తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాత్రికి రాత్రే దాదాపు ఐదు శాతం పోలింగ్ పెరగడంపై నిలదీశామని వెల్లడించారు. సమగ్ర విచారణ జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.