భారతదేశం అగ్రదేశంగా ఎదగాలని శ్రీవారిని కోరాను: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సురేష్ స్థలం: తిరుపతి

భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే అగ్ర దేశంగా ఎదగాలని, అందులో ఆంధ్రప్రదేశ్‌ ముందుండేలా ఆశీర్వదించాలని కోరుతూ శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, ప్రజల కష్టాలు తొలగిపోవాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. తిరుమలలో భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించాలని తితిదేను కోరామని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.