స్లమ్ డాగ్ సినిమాలో జుబైదా పాత్రలో నటిస్తున్న జరీనా వహాబ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా స్లమ్ డాగ్ తర్టీత్రీ టెంపుల్ రోడ్ చిత్రంలో వెటరన్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ఆమె జుబైదా అనే ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారని, ప్రేమతో కూడిన హృదయం పోరాటాలతో నిండిన జీవితం అనే థీమ్ తో కూడిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.