పొదలకూరులో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

పొదలకూరు ఎక్సైజ్ అధికారులు శుక్రవారం మరుపూరు, కలిచేడు గ్రామాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వేంకటేశ్వరరావు తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు అంజయ్య, అయ్యప్పతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.