ఆంధ్రప్రదేశ్‌లో 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి తుది నియామకాల జాబితాను పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.