ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద పదహారు కిలోల గంజాయి స్వాధీనం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు జరిపిన తనిఖీలలో పదహారు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనం మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.