వాయు కాలుష్యంతో బలవన్మరణ ఆలోచనలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
రోజురోజుకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిని బలవన్మరణానికి పాల్పడే ఆలోచనలు పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం హెచ్చరించింది. గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు మరియు నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల ఈ ముప్పు తీవ్రంగా ఉందని యూకేలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. నివారణ చర్యల్లో పర్యావరణ కాలుష్య నియంత్రణను కూడా ప్రధానంగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.