యూట్యూబ్‌లో నగలు చూపించి ఇల్లు గుల్ల చేసుకున్న కన్యాకుమారి మహిళ
రిపోర్టర్: రాము
స్థలం: కన్యాకుమారి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలో యూట్యూబర్ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగింది. తన ఇంట్లో ఉన్న బంగారం, నగదును వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచిన 120 పౌండ్ల బంగారం, వజ్రాల ఆభరణాలతో పాటు రూ.50 వేల నగదును దోచుకెళ్లినట్లు రాజకమంగళం పోలీసులు తెలిపారు.