నాని ది ప్యారడైజ్ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రన్ టైమ్ రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లు ఖరారైంది. చిత్రంలో భారీగా వైలెన్స్, బూతులు ఉండటంతో సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులు సూచించింది. గర్భిణీ స్త్రీలపై టార్చర్ సన్నివేశాలను మార్చడంతో పాటు కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయాలని ఆదేశించింది. రక్తపాతం మరియు యాక్షన్ సీన్లలో విజువల్స్ మార్చాలని సూచించడంతో ఈ చిత్రం హిట్ 3 కంటే ఎక్కువ యాక్షన్తో ఉండబోతుందని స్పష్టమవుతోంది.