తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటనుందని ఐఎండీ హెచ్చరించింది. తీరం దాటే సమయంలో భీకర వాతావరణం నెలకొంటుందని, వర్షం మరియు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.