గ్రేహౌండ్స్ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: Andhra Pradesh
కేవడియాలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఏపీ గ్రేహౌండ్స్ కంటింజెంట్ చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వెల్లడించింది. గ్రేహౌండ్స్ సిబ్బంది వృత్తిగత నిబద్ధత, అంకితభావం, అత్యున్నత కార్యాచరణ నైపుణ్యాలకు ఈ ఘనమైన గుర్తింపు అద్దం పడుతోందని, ఇది రాష్ట్ర పోలీసులకు అత్యంత గర్వపడదగిన క్షణమని వారు పేర్కొన్నారు.