నిరుద్యోగులకు భారీ ఊరట: విద్యుత్ రంగంలో ఆరు వందల ఇరవై ఏడు కారుణ్య నియామకాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

విధి నిర్వహణలో మృతి చెందిన విద్యుత్ ఉద్యోగ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసానిచ్చింది. అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు వందల ఇరవై ఏడు కారుణ్య నియామకాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసినట్లు ఆయన పేర్కొంటూ, పారదర్శక పద్ధతిలో అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేసినట్లు స్పష్టం చేశారు.