మనుబోలులో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయుని పాత్రను, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంలో రాధాకృష్ణన్ అందించిన స్ఫూర్తిని కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.