ఉద్యోగులకు ఐఐటీలతో నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా సాగాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య శిక్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.