వరద ఉధృతిలో కారు కొట్టుకుపోగా ప్రాణాలతో బయటపడిన దంపతులు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం పరిధిలో కుండపోత వాన పడుతుండటంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయవాడ సమీపంలోని నున్న వద్ద పెదవాగు ఉద్ధృతికి కారు కొట్టుకుపోగా, స్థానికులు సాహసించి టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దంపతులను సురక్షితంగా కాపాడారు. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.