రణాబాలి చిత్రంలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంట
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ నూతన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం రణాబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ రణాబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఎందయ్య సామి పాట సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చారిత్రాత్మక చిత్రం 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.