భక్తిశ్రద్ధలతో మండపాలకు తరలిన వినాయక విగ్రహాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
వినాయక చవితి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మండపాలకు విగ్రహాల తరలింపు ప్రక్రియ ఘనంగా ముగిసింది. ఆదివారం భక్తులు కోలాహలం మధ్య డీజేలు మోగిస్తూ ప్రతిమలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.