రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా హైదరాబాద్ లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా, పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.