నేలకొండపల్లిలో బతుకమ్మ వేడుకల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మహిళ మృతి

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన యలగాల భారతి డీజే పాటలకు నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.