దుర్గం చెరువు దుస్థితి: చెత్తాచెదారంతో నిండిన హైదరాబాద్ ప్రముఖ సరస్సు

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయి దయనీయ స్థితిలో ఉంది. హైడ్రా, ప్రభుత్వం చెరువుల పరిరక్షణపై దృష్టి పెడుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, కలుషిత నీటితో చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. అధికారులు వెంటనే స్పందించి, చెరువును శుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.