రోడ్లు లేక బిడ్డను భుజాలపై ఎత్తుకుని వాగు దాటిన గిరిజనుడు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనంతగిరి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి సరైన రహదారి వసతి లేకపోవడంతో ఓ గిరిజనుడు పొంగిపొర్లుతున్న వాగులో తన బిడ్డను భుజాలపై ఎత్తుకుని ప్రాణాలకు తెగించి దాటాడు. బాహుబలి సినిమాను తలపించే ఈ సాహస దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలా ప్రాణాలను రిస్క్ లో పెట్టడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.