సినీ పరిశ్రమలో చేదు అనుభవాలు: దర్శకుడి వేధింపులపై స్వరా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ముంబై
సినీ కెరీర్ ప్రారంభంలో దర్శకుడి నుంచి తీవ్ర వేధింపులు ఎదురయ్యాయని ప్రముఖ నటి స్వరా భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైజ్ అండ్ ఫాల్ సీజన్ రెండు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తొలి రోజుల భయానక అనుభవాలను వెల్లడించారు. రొమాంటిక్ సీన్ల పేరుతో దర్శకుడు తనను ప్రైవేట్‌గా కలవాలని కోరాడని, అర్ధరాత్రి గది తలుపు తట్టి హగ్ కావాలని అడిగాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.