టపాసుల ప్రమాదాలపై త్రివేణి స్కూల్ విద్యార్థులను అప్రమత్తం చేసిన ఫైర్ సిబ్బంది
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దీపావళి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ సిబ్బంది విద్యార్థులకు బాణసంచా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్ వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని భద్రతా నియమాలు పాటించాలని కోరారు.