దారకొండ దారాలమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తుల ఆందోళన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కే.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కే.వీధి మండలం పరిధిలోని దారకొండ దారాలమ్మ ఆలయ గోడ కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన తుపాను ప్రభావంతో ఆలయ పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో పాటు వెనుక భాగంలో ఉన్న రక్షణ గోడ ఒక్కసారిగా కూలిపోయి శిథిలావస్థకు చేరింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ప్రాచీన ఆలయం దెబ్బతినడంతో నిత్యం వచ్చే భక్తులకు ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.