లైసెన్సులు రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాల జారీకి నోటిఫికేషన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో లైసెన్సులు రెన్యువల్ చేసుకోని 414 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం నుంచి అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 5వ తేదీన లాటరీ పద్ధతి ద్వారా నూతన లైసెన్సులను ఖరారు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.