భారతీయులకు డెన్మార్క్ గుడ్ న్యూస్.. ఉద్యోగ అవకాశాలు పెంపు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
విదేశీ నిపుణుల నియామకం కోసం డెన్మార్క్ కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా భారత్ సహా 16 దేశాల నిపుణులు ఉపాధి పొందవచ్చు. అర్హత కలిగిన సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ కొత్త మార్గం వెసులుబాటు కల్పిస్తుంది. భారతీయ నిపుణులకు ఇది యూరప్‌లో గొప్ప అవకాశాలను అందించనుంది.