కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: రూ.17,395 కోట్లతో రెండు నూతన పథకాలకు ఆమోదం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దేశాభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. కంటైనర్ల తయారీ ప్రోత్సాహక పథకం కింద రూ.10,000 కోట్లు కేటాయించగా, ప్రధాన మంత్రి విక్షిత్ గ్రామ స్వరాజ్ యోజన కోసం రూ.7,395.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.