వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేస్తాం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అంధ్రప్రదేశ్

కరువు పీడిత ప్రాంతాల ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీరు, పంటలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.