హిందీ దినోత్సవం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు సునీత మాట్లాడుతూ హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. హిందీ ఉపాధ్యాయుడు షబ్బీర్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ భాష ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.