విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ముట్టడికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో శాప్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేయగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసానికి వెళ్లిన పోలీసులు నిరసనలపై నోటీసులు అందజేశారు.