స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలన్న గొర్లె వీర వెంకట్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీలో శనివారం జనసేన నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలని, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికులా కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు.