పెరిగిన ధరలతో చితికిపోతున్న సామాన్యుడి బతుకు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పరవాడ

పరవాడ సినిమా హాల్ జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ ద్వారా సరుకులు ఇవ్వాలని కోరారు.