ఏఐ కోడింగ్‌పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు కీలక హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: India
సాఫ్ట్వేర్ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సుపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు హెచ్చరించారు. ఏఐని టూల్‌గా మాత్రమే ఉపయోగించాలని, సిస్టమ్‌లపై అవగాహన కోల్పోవద్దని ఆయన సూచించారు. వేగంగా కోడింగ్ రాయడం వల్ల ఉత్పత్తులు త్వరగా వస్తున్నప్పటికీ, డెవలపర్లకు దానిపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా జరిగిన చర్చపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.