దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కవచ్ 4.0 వ్యవస్థ ప్రారంభం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

రైలు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ రైల్వే మరో కీలక అడుగు ముందుకు వేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక కవచ్ 4.0 వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి - కామారెడ్డి మధ్య 108 కిలోమీటర్ల మేర ఈ నూతన సాంకేతిక వ్యవస్థను అమర్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.